
వీట్‌గ్రాస్‌లో అనేక విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన ఎంజైమ్‌లు ఉన్నాయి. అందుకే దీనిని క్యాన్సర్ నిరోధక ఏజెంట్‌గా పిలుస్తారు. ఇందులో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గోధుమ గడ్డిలోని పోషకాలు.. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

గోధుమ గడ్డి రసం తాగడం వల్ల నోటి క్యాన్సర్‌కు కారణమైన కణాలను 41శాతం తగ్గించవచ్చని NCBI అధ్యయనం ( Ref ) పేర్కొంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ( Ref ) లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గోధుమ గడ్డి రసం తాగడం వల్ల మూడు రోజుల్లో లుకేమియా కణాలు, అంటే రక్త క్యాన్సర్ కణాలు 65శాతం తగ్గాయని టెస్ట్-ట్యూబ్ అధ్యయనంలో తేలింది.

క్యాన్సర్ కణాలను నివారించడం, తగ్గించడంతో పాటు, గోధుమ గడ్డి రసం తాగడం వల్ల దంత క్షయం నివారించవచ్చు. అధిక రక్తపోటు తగ్గుతుంది. ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. జలుబుకు చికిత్స చేయవచ్చు. వికారం నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇటీవలి సంవత్సరాలలో గోధుమ గడ్డి అపారమైన ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఇది అనేక వ్యాధుల్ని నివారించడానికి, జీవక్రియ శక్తిని పెంచడానికి, క్యాన్సర్ కణాలను తొలగించడానికి, బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర, రక్తపోటును నియంత్రించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధి. గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలను నిరోధించే, తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గోధుమ గడ్డిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ను సైతం నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. గోధుమ గడ్డిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.