
వేయించిన ఆహారం, ఉప్పు: మన రోజువారి జీవింతలో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది లేకుండా ఏ ఆహారాన్ని మనం తినలేం. అలాగే ఇది ఎక్కువైనా కూడా అది తినడానికి పనికి రాకుండా పోతుంది. అదేవిధంగా, అధికంగా ఉప్పు తీసుకోవడం ఊపిరితిత్తులకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పును తగ్గించడం మంచిది. అంతే కాదు ప్రై చేసిన ఆహారాలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల ఫ్రైడ్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, వీటిని అధికంగా తీసుకోవడం ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. కొందరిలో పాలు, చీజ్ వంటి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాసనాళాల్లో కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మీకు ఇప్పటికే దగ్గు లేదా అస్తమా ఉంటే, వీటిని కాస్త తగ్గించడం మంచిది.

మద్యం : అధికంగా మద్యం సేవించడం మీ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. మద్యంలోని సల్ఫేట్లు ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి, ఇథనాల్ మీ ఊపిరితిత్తులలోని కణాలను ప్రభావితం చేస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు కూడా రావచ్చు. అంతే కాదు మద్యపానం ఊపిరితిత్తుల రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు సులభంగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మద్యాన్ని వీలైనం దూరంగా ఉండడం మంచిది

పొగ త్రాగడం: మీరు బీడీ, సిగరెట్, చేట్టా వంటికి తాగడం వల్ల ఆ పొగ నేరుగా మీ ఊపితిత్తుల్లోకి వెల్తుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పొగ తాగడం మానుకోండి. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం తగ్గించుకోండి. ఎందుకంటే వీటిని నిల్వ చేసేందుకు నైట్రైట్లు వాడుతారు. ఇవి ఊపిరితిత్తులలో వాపు, ఒత్తిడిని కలిగిస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన మాంసాలు ఊపిరితిత్తులకు హానికరం కావచ్చు.

శీతల పానీయాలు : సాఫ్ట్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును మందగించేలా చేస్తుంది. అంతేకాకుండా, పెద్దలలో ఇది క్రానిక్ బ్రోన్కైటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు మీ ఉపిరితిత్తులను కాపాడుకోవాలి అనుకున్నా, ఎక్కువ కాలంగా బ్రతకాలి నుకున్నా.. ఈ సాఫ్ట్‌డ్రింక్స్‌కు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.