
అందరికీ అందుబాటు ధరలో లభించే పండు జామ. ఒక జామ పండులో రెండు గుడ్ల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రతిరోజూ జామ తినడం ఆరోగ్యానికి మంచిది.

జామ పండ్లే కాదు.. జామ ఆకులు కూడా పోషకాలు అందిగా కలిగి ఉంటాయి. జామ ఆకు సారం ప్రేగులలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే, విరేచనాలను నిరోధించే యాంటీమైక్రోబయాల్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ జామలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. జామ రోజూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గిస్తుంది.

జామ ఆకులు క్యాన్సర్‌ను నివారించడంలో మేటి. టెస్ట్ ట్యూబ్, జంతు అధ్యయనాలు జామ ఆకు సారం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదని చూపించాయి. జామలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. జామ ఆకు నూనె అనేక క్యాన్సర్ మందుల కంటే 4 రెట్లు ఎక్కువ శక్తివంతమైనదని ఒక టెస్ట్-ట్యూబ్ అధ్యయనం వెల్లడించింది. దీని తుది ఫలితాల కోసం పరిశోధనలు ఇంకా కొనసాగుతోంది.

జామలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ వృద్ధాప్యాన్ని కాపాడగలవు. ఇది మొటిమల నుంచి కూడా రక్షిస్తుంది. జామ పండ్లను రోజూ తినడం ద్వారా ఇందులోని విటమిన్ ఎ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జామ మహిళల్లో పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ ఆకులను ఎలా తినాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా జామ ఆకులను వేడినీటిలో వేయాలి. వాటిని సుమారు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. టీ స్ట్రైనర్ ద్వారా వడకట్టి, సుమారు 5 నిమిషాలు చల్లబరచండి. ఈ గోరువెచ్చని పానీయాన్ని ఖాళీ కడుపుతో తాగాలి. ఇది కడుపు నొప్పి నుంచి మీకు ఉపశమనం అందిస్తుంది.