
గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న బంగారం అక్టోబర్ 27న అనూహ్యంగా భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజే (అక్టోబర్ 27) గోల్డ్ రేటు రెండోసారి తగ్గింది. ఉదయం గరిష్టంగా రూ. 1050 తగ్గిన రేటు.. సాయంత్రానికి మరో రూ. 1290 తగ్గింది. మొత్తం మీద సోమవారం ఒక్కరోజే బంగారం ధర రూ.2340 తగ్గింది

తగ్గిన ధరల తర్వాత అక్టోబర్ సాయంత్రానికి దేశ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,23,280గా కొనసాగుతుంది. దీని ధర సోమవారం రూ.1,24,480గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,13,000 గా ఉంది. ఇది ఉదయం రూ.1,14,100 గా ఉంది.

ఇక మన హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2340 తగ్గి.. రూ. 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

బంగారం ఇంతలా తగ్గడానికి ప్రధానం అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ప్రారంభించారు. దీంతో విలువైన బంగారం ధరలపై ఒత్తడి పెరింగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

ముఖ్యంగా సోమవారం ఒక్కరోజే బంగారం ధర రూ.2వేలకు పైగా తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా- చైనా వాణిజ్య ఒప్పందానికి కొలిక్క వస్తున్నాయని.. త్వరలోనే చైనా అధ్యక్షుడితో సమావేశం అవుతానని ఇటీవలే ట్రంప్ ప్రకటించాడు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్ భారీగా పడిపోయాయి. అదే సమయంలో డాలర్ పుంజుకోవడం ప్రారంభించింది.