
గత కొన్ని రోజులుగా దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో పసిడి ధర ఒకేసారి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక సందర్భంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,380 డాలర్లపైగా నమోదైంది. కానీ రెండు మూడు రోజులుగా ఇది తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉండగా శుక్రవారం నుంచి శనివారం 11 గంటల మధ్యలోనే బంగారం ధర రెండు సార్లు తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు తులం బంగారంపై రూ.1500 తగ్గగా.. ఉదయం 6 నుంచి 11గంటల మధ్యలో మరోసారీ భారీగా తులంపై రూ. 1,950 తగ్గింది.

దీంతో శనివారం ఉదయం 6 గంటలకు తులం బంగారం ధర రూ. రూ.1,27,030 గా ఉండగా.. ఉదయం 11 గంటల తర్వాత ఈ ధర రూ.1,25,080గా కొనసాగుతుంది. అంటే కేవలం ఐదు గంటల్లోనే తులం బంగారంపై రూ.1,950 తగ్గింది.

ఇక వెండి విషయానికి వస్తే శనివారం ఉదయం 6 గంటలకు కిలో వెండి ధర రూ.1,73,200గా ఉండగా.. ఉదయం 11 గంటల తర్వాత ఇది రూ.1,69,000కి చేరుకుంది కొనసాగుతోంది.

ఇక హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లోని బంగారం వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,650గా ఉంది, ఢిల్లీ, ముంభై, విజయవాడ, బెంగళూరులో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యలో ఈ రేట్లు కొనసాగుతున్నాయి. ఇవి మార్కెట్‌ను బట్టి మారే అవకాశం ఉంది.