Gold: గత పదేళ్లలో బంగారం ఎంత లాభం తెచ్చిందో తెలుసా..? ఈ లెక్కలు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated on: Jun 29, 2026 | 11:31 AM

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పండగ వచ్చినా, పెళ్లిళ్ల సీజన్ అయినా.. ధరలతో సంబంధం లేకుండా మనవాళ్లు బంగారం కొంటూనే ఉంటారు. అయితే బంగారం కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు.. ఆపదలో ఆదుకునే అత్యుత్తమ పెట్టుబడి సాధనం అని కాలం ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది. రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం ఇచ్చే రాబడి చూస్తే సామాన్యులైనా, ఆర్థిక నిపుణులైనా నోరెళ్లబెట్టాల్సిందే..

1 / 5
మనం పదేళ్ల క్రితం అంటే 2016వ సంవత్సరంలోకి వెళ్తే.. అప్పట్లో మార్కెట్లో పసిడి ధరలు సామాన్యుడికి చాలా అందుబాటులో ఉండేవి. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు కేవలం రూ. 2,600 నుండి రూ. 3,000 మధ్య ఉండేది. ఆ సమయంలో ఎవరైనా ఒక 5 గ్రాముల బంగారు నాణేన్ని కొనుగోలు చేసి ఉంటే, వారు గరిష్టంగా రూ. 13,000 నుండి రూ. 15,000 లోపే ఖర్చు చేసి ఉండేవారు.

2 / 5
బంగారు నాణేలను కొనుగోలు చేసేటప్పుడు ధర ఎప్పుడూ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదే బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేసేటప్పుడు మాత్రం, వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆభరణాలుగా కొనేటప్పుడు మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారణంగా బంగారు నాణేలను కొనుగోలు చేయడంతో పోలిస్తే ఆభరణాలుగా కొనేటప్పుడు జేబుకు ఎక్కువ చిల్లు పడుతుంది.

3 / 5
ఇప్పుడు కట్ చేస్తే ప్రస్తుత సంవత్సరానికి  వద్దాం. ఈ రోజు నాటికి మార్కెట్లో పసిడి ధరలు ఊహించని విధంగా ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు మార్కెట్లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.13,370 వద్ద పలుకుతోంది. ఈ పరిస్థితిలో ఈ రోజు ఎవరైనా అదే 5 గ్రాముల బంగారాన్ని కొనాలనుకుంటే.. కేవలం పసిడి నికర విలువ కోసమే సుమారు రూ.66,880 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

4 / 5
అయితే ఈ రూ. 66,880 అనేది కేవలం ప్యూర్ బంగారం ధర మాత్రమే. దీనికి జ్యువెలరీ షాపుల వారు వేసే ప్రాసెసింగ్ ఫీజులు, ప్రభుత్వం విధించే జీఎస్టీ పన్నులను కలిపితే.. ఈ 5 గ్రాముల బంగారం కొనడానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ. 77,000 వరకు పెరుగుతుంది. అంటే పదేళ్ల క్రితం కేవలం రూ.15,000 లోపు దొరికిన బంగారం.. ఇప్పుడు రూ. 77,000 విలువైన భారీ ఆస్తిగా మారిపోయింది.

5 / 5
ఈ లెక్కన చూసుకుంటే.. 2016 నుండి 2026 వరకు ఉన్న ఈ 10 సంవత్సరాల కాలంలో బంగారం పెట్టుబడిదారులకు ఏకంగా మూడు రెట్లకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. అప్పట్లో రూ. 15,000 పెట్టి 5 గ్రాములు కొని దాచుకున్న వారు.. ఇప్పుడు ఏకంగా రూ. 60,000 పైనే నికర లాభాన్ని ఆర్జించి ఉంటారు. షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌లతో కూడుకున్నవి అనుకునేవారికి.. పసిడి ఎప్పటికీ నమ్మకమైన, తిరుగులేని 'గోల్డెన్' ఇన్వెస్ట్‌మెంట్ అని ఈ పదేళ్ల రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.

Follow Us