
సామాన్యులకు బంగారం, వెండి ధరలు మరోసారి భారీ షాక్ ఇచ్చాయ్.. శుక్రవారం ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రామాలు బంగారంపై రూ. 5,400 పెరగ్గా.. కేజీ వెండి ధరపై ఏకంగా నాలుగు గంటల్లోనే రూ.20,000 వరకు పెరిగింది. మునుపెన్నడూ ఇంత భారీగా వెండి పెరిగిన దాఖాలులేవని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరను చూసుకుంటే రూ. 1,59,710 వద్ద కొనసాగుతుంది ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,54,300గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార రూ.1,46,400గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,41,450 వద్ద ఉంది.

ఇక విజయవాడ, విశాఖ పట్నంలోని బంగారం ధరలు చూసుకుంటే ఈ రెండనగాల్లో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద స్థిరపడింది.

ఇక దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలైన ముందై, బెంగళూరు, కేరళ, పూణే, కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,710 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,400 వద్ద స్థిరపడింది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,59,860గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,820 వద్ద కొనసాగుతుంది.

ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా పసిడి బాటలోనే నడుస్తుంది. శుక్రవారం బంగారం కేవలం రూ.5000పైగా పెరిగితే వెండి మాత్రం ఏకంగా రూ.20,000 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉండగా హైదరాబాద్‌లో మాత్రం కేజీ వెండి ధర రూ.3,46,000గా కొనసాగుతుంది.