మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే

Updated on: Jul 31, 2026 | 3:06 PM

నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. ఇక కొంత మందికి మటన్ ఎక్కువ ఇష్టం ఉంటే, మరికొంత మందికి బోటీ, తలకాయ కర్రీ, కాళ్ల సూప్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొందరు అసలు కీళ్ల సూప్ తీసుకోవడానికి కూడా అంతగా ఆసక్తి చూపరు. కానీ మేక కాళ్ల సూప్ తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేక కాళ్ల సూప్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మేక కాళ్ల సూప్ తాగడం చాలా ప్రయోజనకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరానికి బలం ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది.

2 / 5
ఆషాఢ మాసంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా కాళ్లు, కీళ్ల నొప్పులు, జ్వరం వంటి సమస్యలతో సతమతం అవుతారు. అయితే ఈ మేక కాళ్ల సూప్ తాగడం వలన  ఆ సమస్యల అన్నింటి నుంచి కూడా కోలుకోవడానికి హెల్ప్ అవుతుందంట. ముఖ్యంగా మేక కాళ్ల సూప్‌లో కాల్షియం, కొలాజెన్, గ్లూకోసమైన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది అర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

3 / 5
ప్రతి రోజూ ఉదయం లేదా వారంలో ఒకసారి లేదా ఆషాఢ మాసంలో ఈ మేక కాళ్ల సూప్ తాగడం వలన ఇది ఇమ్యూనిటీని పెంచి, సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా బలహీనతలను తగ్గిస్తుంది. జ్వరం, కొంత మందికి డెలివరీ, ఆపరేషన్ తర్వాత ఉండే పేయిన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

4 / 5
మేక కాళ్ల సూప్ దగ్గు, జలుబు, సైనస్ వంటి సమస్యల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. గోరు వెచ్చటి సూప్ ఈ వర్షాకాలంలో ప్రతి రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తాగడం వలన ఇది గొంతు నొప్పి, ఛాతిలో కఫం వంటి అన్ని సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా పేగు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది.

5 / 5
మేక సూప్‌లో జెలటిన్ అనే పదార్థం ఉంటుంది. దీని వలన పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా అల్సర్, గ్యాస్ వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. అన్నివిధాలుగా మీకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆషాఢంలో మేక కాళ్ల సూప్ తీసుకోవడం వలన ఇది కాళ్ల నొప్పుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us