
ప్రస్తుత కాలంలో పోషకాహార లోపం, లైఫ్ స్టైల్‌లో మార్పులు, వాతావరణ పరిస్థితుల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు అనేది వస్తుంది. దీని వల్ల నలుగురిలో తిరిగేందుకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తెల్లజుట్టు కనిపించకుండా హెయిర్ ప్యాక్స్, హెయిర్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు.

మనకు లభించే ఉసిరితో మీరు తెల్ల జుట్టును మాయం చేసుకోవచ్చు. మంచి నిగనిగలాడే నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా జుట్టు కూడా బలంగా, దృఢంగా తయారవుతుంది. చుండ్రు, హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుంది.

ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో ఉసిరి పొడి, తేనెను బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా నీరు పోసి.. పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు అప్లై చేసి.. ఓ గంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తే తెల్ల జుట్టు మాయం అవుతుంది.

మరో చిట్కా ఏంటంటే.. ఉసిరి కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో గోరు వెచ్చటి నీళ్లు వేసి బాగా నానబెట్టండి. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని నేరుగా తలకు అప్లై చేసి.. ఓ అరగంట తర్వాత హెడ్‌బాత్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.

అలాగే ఉసిరి కాయల్ని ముక్కలుగా కట్ చేసి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. ఈ నీరు చల్లారాక.. తలకు బాగా పట్టించండి. ఆ తర్వాత సాధారణ నీటితో తల స్నానం చేయాలి.