Health Tips: వామ్మో.. ఈ అలవాట్లు మీకూ ఉన్నాయా?.. అయితే ఆ సమస్య ఆన్‌దివేలో ఉన్నట్టే..

Updated on: Oct 03, 2025 | 10:10 PM

ప్రస్తుల రోజుల్లో చాలా మంది గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. స్పైసీ ఫుడ్ తినడం వల్లే ఈ సమస్య వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ మీ జీవనశైలిలో కొన్ని అలవాట్లు కూడా ఈ సమస్యలకు కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లను దూరం చేసుకోవడం వలన మీరు మీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలను నియంత్రించవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి అలవాట్లు మానుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 6
తిన్న వెంటనే నిద్రపోవడం: మనలో చాలా మందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం మన జీర్ణప్రక్రియను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా తినడం, భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం యాసిడ్ రిఫ్లక్స్‌కు ప్రధాన కారణాలు. మీరు నిద్రపోతున్నప్పుడు, కడుపులోని ఆమ్లం సులభంగా అన్నవాహికలోకి పెరుగుతుంది. దీని వల్ల మీకు గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ అలవాట్లను వెంటనే మానుకోండి

2 / 6
అతిగా తినడం: ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ఒకే సారి ఇలా ఎక్కువ తినడం వల్ల కడుపుపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. కడుపు కవాటాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మీకు ఆకలి వేసినప్పుడు మితంగా తినండి.

3 / 6
ఒత్తిడి, ఆందోళన: ఒత్తిడి లేదా ఆందోళన హార్మోన్ల మార్పులకు కారణమవుతుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కడుపు ఆమ్ల స్రావాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం యోగా, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోండి.

4 / 6
టీ, కాఫీ తాగడం: కారంగా ఉండే ఆహారాలు కాకపోయినా, కాఫీ, టీ, సోడా, ఆల్కహాల్ వంటి ఆమ్ల పానీయాలు కడుపు ఆమ్ల స్థాయిలను పెంచుతాయి, ఇది గుండెల్లో మంటను ప్రేరేపిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

5 / 6
టైట్‌ బట్టలు వేసుకోవడం: భోజనం తర్వాత కడుపు లేదా నడుము చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు లేదా బెల్టులు ధరించడం వల్ల కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సౌకర్యంగా ఉండే దుస్తువులు ధరించేందుకు ట్రై చేయండి.

6 / 6
ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడేందుకు మీరు తరచుగా, చిన్న చిన్న భోజనం తినండి, అలాగే, భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాసేపు నడవండి, లేదా పడుకోవడానికి గంటా, రెండు గంటల ముందే తినండి. ఇలా చేయడం ద్వారా మీరు గ్యాస్ట్రిక్ సమస్యను అదిగమించవచ్చు( NOTE:ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)