వెల్లుల్లి కారం వేసి చికెన్ ఫ్రై ఇలా చేసారంటే.. పలావ్ రైస్ లోకి బ్రహ్మాండంగా ఉంటుంది

Updated on: Nov 02, 2026 | 8:25 PM

వెల్లుల్లి కారం చికెన్ వేపుడు రెసిపీ పాత పద్ధతులకు భిన్నంగా అద్భుతమైన రుచి వస్తుంది. చికెన్ సాఫ్ట్‌గా ఉండి, పైన ఘాటైన వెల్లుల్లి కారం మసాలాతో కూడి, బగారా రైస్‌తో కలిపి తింటే నోరూరించే అనుభూతిని ఇస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్థాలు: చికెన్: 1 కిలో (బోన్ లెస్ లేదా నార్మల్),  నూనె: 3-4 స్పూన్లు,  చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి: తగినంత
ఉల్లిపాయలు: 2 మీడియం సైజు, తరిగినవి, పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడా,   కరివేపాకు: కొంచెం, పుదీనా: కొంచెం
 ధనియా జీరా పొడి: 1 స్పూన్,  పచ్చిమిర్చి: కొన్ని చీలికలు,  కొత్తిమీర తరుగు: కొంచెం, వెల్లుల్లి రెబ్బలు: 2 గుప్పెళ్లు,  కారం: 2 స్పూన్లు
ఉప్పు: తగినంత,  జీలకర్ర: 1 స్పూన్, కరివేపాకు: కొంచెం, ఎండుకొబ్బరి పొడి: 2 స్పూన్లు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: చికెన్: 1 కిలో (బోన్ లెస్ లేదా నార్మల్), నూనె: 3-4 స్పూన్లు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి: తగినంత ఉల్లిపాయలు: 2 మీడియం సైజు, తరిగినవి, పసుపు: చిటికెడు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: కొంచెం, పుదీనా: కొంచెం ధనియా జీరా పొడి: 1 స్పూన్, పచ్చిమిర్చి: కొన్ని చీలికలు, కొత్తిమీర తరుగు: కొంచెం, వెల్లుల్లి రెబ్బలు: 2 గుప్పెళ్లు, కారం: 2 స్పూన్లు ఉప్పు: తగినంత, జీలకర్ర: 1 స్పూన్, కరివేపాకు: కొంచెం, ఎండుకొబ్బరి పొడి: 2 స్పూన్లు తీసుకోవాలి.

2 / 5
ఒక కిలో చికెన్‌ను శుభ్రంగా కడిగి, నీరంతా పోయేలా జల్లెడలో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిని పొయ్యి మీద పెట్టి, 3-4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత, తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి అవి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించాలి

3 / 5
ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పసుపు, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి బాగా కలపాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్‌ను కడాయిలో వేసి, చికెన్ లోని నీరంతా బయటకు వచ్చి, చికెన్ 90% ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి.  చికెన్‌ను ఒకసారి బాగా కలిపి, రెండు మూడు నిమిషాల తరువాత నీరు బయటకు వస్తాయి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసి, మొత్తం ఒకసారి బాగా కలిపి, చికెన్ 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.

4 / 5
 చికెన్ ఉడికే లోపు, వెల్లుల్లి కారం పేస్ట్‌ను సిద్ధం చేసుకోవాలి. రెండు గుప్పెళ్ల వెల్లుల్లి రెక్కలు, రెండు స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, రెండు స్పూన్ల ఎండుకొబ్బరి పొడి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్‌లో నీరంతా ఇంకిపోయి, అది చక్కగా 90% వరకు ఉడికిన తర్వాత, ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి, కారం ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి.

5 / 5
కారం మొత్తం చికెన్ ముక్కలకు పట్టిన తరువాత, రెండు నిమిషాలు ఫ్రై చేసి, డ్రైగా అయిన తర్వాత, చివరిగా ఒక స్పూన్ ధనియా జీరా పొడి, కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి దించేయాలి. ఈ వెల్లుల్లి కారం చికెన్ వేపుడు వేడివేడి అన్నంతో లేదా బగారా రైస్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. పల్లెటూరి హోటళ్ళలో అందించే ప్రత్యేకమైన రుచిని ఇది అందిస్తుంది. ఈ వంటకంతో పాటు ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us