
Fruits For Health: పండ్లు తినడం ఆరోగ్యకరం. అయితే, ఆ పండ్లను సలాడ్‌గా చేసుకుని, దానిపై ఉప్పు, చాట్ మసాలా వేసుకుని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఆ సమస్యలేంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ గా పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది ప్రజలు రోజూ పండ్లను తింటారు కూడా. అయితే, కొందరు పండ్లు తినే విదానం కారణంగా అందులోని పోషకాలు శరీరానికి అందవు. పైగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

కొందరు పండ్లను ముక్కలు చేసుకుని సలాడ్ మాదిరిగా చేసుకుంటారు. టేస్ట్ కోసం ఆ ముక్కలపై ఉప్పు, చాట్ మసాలా కూడా వేసుకుంటారు. అయితే, ఇది ఆరోగ్యానికి హానీ తలపెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. బరువు నియంత్రించుకోవాలనుకునే వారు ఇలా చేయొద్దని హితవు చెబుతున్నారు.

ఉప్పు, చాట్ మసాలా, చక్కెర పండ్లపై వేసుకుని తినడం వల్ల పండ్లలోని పోషకాలు ధ్వంసం అయిపోతాయి. పండులోని ఖనిజాలు, విటమిన్లు సరిగా శరీరానికి అందకుండాపోతాయి. పైగా ఉప్పు, చాట్ మసాలా వేసిన పండ్లను తినడం ల్ల శరీరంలో సోడియం పెరుగుతుంది. అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు తలెత్తాయి.

ఉప్పు, మసాలాలు కలిపిన పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. పొత్తికడుపులో నొప్పి, అజీర్తి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఖాళీ పండ్లను తినలేకపోతే.. దానిపై ఎర్ర మిరియాలు, లవంగం పొడిని చల్లుకుని తినొచ్చు. లేదా పండ్లతో పెరుగు మిక్స్ చేసి హెల్తీ ఫ్రూట్ సలాడ్‌ను తయారు చేసుకుని తినొచ్చు. కానీ ఉప్పు, చక్కెర, చాట్ మసాలా అస్సలు వేసుకోవద్దు.