
అదనపు బంపర్స్: కారు కొన్న వెంటనే చాలా మంది చేసే పని ఏమిటంటే.. తమ వాహానానికి ఏమి కాకూడదని ముందూ, వెనక అదనంగా స్టీల్ బంపర్స్‌ను బిగిస్తారు. కానీ ఇలా అదనపు బంపర్లను అమర్చుకోవడం మోటారు వెహికిల్ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం నిషేధమని అధికారులు చెబుతున్నారు.ఈ బంపర్స్ ఉండడం వల్ల ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ త్వరగా ఓపెన్ అవ్వకపోవడం, ఆ బంపర్స్ తగిలి పక్క నుంచి వెళ్లే బైక్స్ కిందపడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

నంబర్ ప్లేట్స్: దేశ వ్యాప్తంగా ఒకే రకమైన నంబర్ ప్లేట్లను తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హైసెక్యూరిటీ ప్లేట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు నంబర్ ప్లేట్స్ రూపాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. కొన్ని లెటర్స్ పెద్దగా కొన్ని చిన్నగా వేయించడం, నెంబర్ ప్లేట్స్‌పై ఇతర పేర్లు, స్టిక్కర్లు వేయించడం చేస్తున్నారు. ఇలా చేయడం చట్ట విరుద్దమని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటివి వాహనంపై పోలీసులకు అనుమానం కలిగించవచ్చని చెబుతున్నారు.

అద్దంపై స్టిక్కర్స్: చాలా మంది అద్దాలపై పెద్ద పెద్ద స్టిక్కర్లు, దేవుడి పేర్లు రాయించుకుంటారు. కానీ వాహనానికి వెనక, ముందు ఉన్న అద్దాలపై రేడియం అతికించడం, పేర్లు రాయించడం, ఫోటోలు వేయడం చేయరాదు. అంతేకాదు అద్దాలు 70శాతం సన్‌రైజ్ ప్రసరింపజేసేలా ఉండాలని చెబుతున్నారు. కార్ల అద్దాలపై పేర్లు రాయిస్తే మోటారువాహన చట్టంలోని 177సెక్షన్ ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

బ్లాక్ ఫిల్మ్ గ్లాసెస్: దేశ భద్రతా నిమిత్తం ఇప్పటికే బ్లాక్ ఫిల్మ్స్ ఉన్న అద్దాలను బ్యాన్ చేశారు. కానీ చాలా వరకు జనాలు వాటి ప్లేస్‌లో సన్‌షేడ్‌లు, మాగ్నటిక్ కర్టెన్లు వాడడం స్టార్ట్ చేశారు. కానీ ఇవి కూడా చట్టవిరుద్ధమేనని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి కర్టెన్స్ వాడడం వల్ల కార్ టర్న్ తీసుకునేప్పుడు, లేదా సైడ్ మిర్రర్ సెట్ చేసుకునేప్పుడు ఇబ్బందులు కలగొచ్చని చెబుతున్నారు.

కాబట్టి మీ వాహనాలకు బిగించుకునే యాక్సెసరీస్ అనేవి.. దాని అసలు ఫ్రేంను, వేగాన్ని, సౌండ్‌ను మార్చకుండా చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే రూల్స్‌కు విరుద్దంగా ఇలా ఎక్ట్రా యాక్సెసరీస్ యాడ్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ వర్తించకపోవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఇకపై వాహనాలకు అదనపు యాక్సెసరీస్ యాడ్ చేసే ముందు ఇవి గుర్తించుకోండి.