
చపాతీ, అన్నం వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. అధ్యయనాల ప్రకారం.. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం ఇన్సులిన్ వాడకాన్ని తగ్గిస్తుంది.

ఉదయం చక్కెర టీ లేదా కాఫీకి బదులుగా ఒక చిటికెడు లవంగాల పొడిని తాగడం వల్ల పగటిపూట రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మరో అధ్యయనంలో, అన్నం తినే ముందు పీచు కూరగాయలు తినడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. కూరగాయలలో ఉండే ఫైబర్, పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తాయి.

సులువుగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లకు బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మంచిది. బేకరీ ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ వంటివి వెంటనే గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే ధాన్యాలు, చిక్కుళ్ళు, కూరగాయలు వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అవి నెమ్మదిగా జీర్ణమై, గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి.

కాకరకాయ రసం: వారానికి మూడు సార్లు కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు. జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కాకరకాయ రసం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

భోజనం తర్వాత నడక: భోజనం చేసిన తర్వాత కనీసం 20 నిమిషాలు నడవడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెరలో వచ్చే ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది. 2022లో న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, భోజనం తర్వాత 30 నిమిషాలు వేగంగా నడవడం వల్ల గ్లూకోజ్ పెరుగుదల గణనీయంగా తగ్గుతుంది.