
పాతకాలంలో మన తాత ముత్తాతలు నోటికి తియ్యగా ఉండే ఎన్నో కొత్త వంటకాలు చేసి తినేవాళ్లు. వాటిలో పటిక బెల్లం పొడి, నెయ్యి, సోంపుతో చేసే ఉండలు బాగా తినేవాళ్లు. దీనిని ఇక ఇంట్లో ఉండే వాటితోనే చేయోచ్చు. కళ్ళు సరిగా కనబడని వాళ్ళు ఇది కప్పు తింటే వంద శాతం కంటి చూపు డబుల్ అవుతుంది. ఇది చాలా శక్తివంతమైనది కూడా.

సోంపు ఉండలలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పటిక బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక కప్పు సోంపు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్స్ కొబ్బరి పొడి , ఇంకా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే రుచికరంగా ఉంటుంది.

ముందుగా పాన్ తీసుకుని దానిలో సోంపు వేసి మీడియం మంటపై వేయించాలి. ఇది వాసనా వచ్చిన తరవాత దించేయాలి. ఆ తర్వాత దీనిని మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా పొడి చేసుకుంటే సోంపు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక పటిక బెల్లం పొడిని తీసుకోవాలి.

సోంపు పొడిలో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది మంచి రుచి, సువాసనను కూడా అందిస్తాయి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి ఆ తర్వాత పటిక బెల్లం పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మిశ్రమం తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. అంతే వేడి వేడి సోంపు ఉండలు రెడీ

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)