
స్వీట్ పొటాటోగా పిలిచే చిలకడదుంపల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. అలాగే ఇందుల్లో తక్కువ క్యాలరీలు తక్కువగా ఉండడమే అధిక ఫైబర్ శరీరానికి మంచి చేస్తుంది.

అవకాడోలో ప్రాథమిక యాంటీ ఆక్సిడేంట్లు అధికంగా ఉంటాయి. దీంతో రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. అలాగే ఇందులో అధికంగా విటమిన్ -ఈ ఉంటుంది.

డార్క్ చాక్లెట్లలో ఉండే కోకాలో థియోబ్రొమిన్ ఉంటుంది. ఇది తెల్ల రక్తకణాలను కాపాడడంతో సాయం చేస్తుంది. అయితే చాక్లెట్లలో అధికంగా క్యాలరీలు, కొవ్వు ఉంటాయి కాబట్టి అత్యంత డార్క్ గా ఉండే చాక్లెట్లను ఎంచుకోవడం మంచిది.

వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్‌గా పని చేసే వివిధ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వెల్లుల్లి జలుబును నివారిస్తుంది, జ్వరాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అలాగే రక్తపోటును స్థిరీకరించడంలో సాయం చేస్తుంది.

Almonds Health Benefits

బ్లాక్ బెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే శ్వాసకోశ ఇబ్బందుల నుంచి రక్షించడానికి ఇవి చాలా బాగా పని చేస్తాయి.

బ్రొకోలిలో వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు మెండుగా ఉంటాయి. విటమిన్లు ఏ,సి,ఈ లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందించడానికి సాయం చేస్తాయి. అయితే దీన్ని సాధారణ స్థాయి వేడిలోనే ఉడికించడం ఉత్తమం.

పసుపును మన వంటకాల్లో ప్రతిరోజూ వాడుతుంటాం. ఇందులో యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు శరీరానికి సాయం చేస్తాయి. అలాగే వ్యాయామం వల్ల కలిగే కండరాల నష్టాన్ని నివారించడంలో సాయం చేస్తుంది.

విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మకాయ, నారింజ, కమల, బత్తాయి ఫలాలు శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్పత్తిని పెంపొందిస్తాయి. అలాగే జలుబును నివారించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.