uppula Raju |
May 22, 2022 | 5:35 PM
ఎక్కిళ్లు వస్తే ఎవరైనా గుర్తొస్తారని అంటారు కానీ వాస్తవానికి అందులో నిజం లేదు. ఎక్కువ ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వల్ల ఎక్కిళ్ళు అకస్మాత్తుగా వస్తాయి. వీటిని వదిలించుకోవడానికి మీరు కొన్ని చిట్కాలని ప్రయత్నించవచ్చు.
తేనె: నిరంతరం ఎక్కిళ్ళ సమస్య ఉంటే ఒక చెంచా తేనె తీసుకోండి. దీని తీపి నరాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ఎక్కిళ్ల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ: ఎక్కిళ్ళు ఆపడానికి మీరు నిమ్మకాయ సహాయం తీసుకోవచ్చు. సన్నని నిమ్మకాయ ముక్కల రసాన్ని తీసుకోవాలి. ఇది ఎక్కిళ్లని ఆపడానికి పనిచేస్తుంది.
ఐస్ బ్యాగ్: మీరు ఎక్కిళ్ల సమస్యను ఆపాలనుకుంటే మెడపై ఐస్ బ్యాగ్ పెట్టండి. లేదంటే చల్లని నీటిలో ఒక వస్త్రాన్ని ముంచి ఉపయోగించవచ్చు. ఇది ఎక్కిళ్లను ఆపడానికి సహాయపడుతుంది.
వెనిగర్: ఎక్కిళ్ళు ఆపడానికి మీరు వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం నోటిలో రెండు చుక్కల వెనిగర్ వేయండి. ఇది ఎక్కిళ్ల నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.