Srilakshmi C |
Jul 12, 2023 | 10:53 AM
మోకాళ్లు, మోచేతులపై చర్మం పలుచగా ఉంటుంది. అందువల్లనే సూర్య రశ్మి కారణంగా ఆ ప్రాంతాల్లో చర్మం త్వరగా నల్లబడుతుంది. దీనివల్ల హైపర్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.
చాలా మంది అందమైన చేతులు, కాళ్ల కోసం మానిక్యూర్, పెడిక్యూర్ చేయిస్తూంటారు. కానీ మోకాళ్లు, కాలి మడమలు, మోచేతులపై ఏర్పడే పిగ్మెంటేషన్ అంతగా శ్రద్ధ చూపరు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో చర్మం గరుకుగా, నల్లగా మారుతుంది.
నిమ్మకాయలోని బ్లీచింగ్ లక్షణాలు సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, కాంతివంతం చేస్తుంది. సగానికి కోసిన నిమ్మ కాయముక్కపై కిసింత ఉప్పు జల్లుకుని మోచేతులు, మోకాళ్లపై పది నిముషాలపాటు రుద్ది ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రెండు చెంచాల పెరుగులో మూడు చుక్కల వైట్ వెనిగర్ కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసుకోవాలి. ఆరాక గోరు వెచ్చని నీళ్లోతో కడిగిస్తే సరి.
ఒక స్పూన్ చక్కెరలో నాలుగైదు చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న ప్రదేశంలో 15 నిమిషాలు స్క్రబ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి.