
చాలా మంది వంకాయ తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఘరం మసాలాలతో ఇలా వంకాయ ఫ్రై చేస్తే , ఆ రుచి జీవితంలో మర్చిపోరంట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వంకాయ ఫ్రై తింటే , చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి.

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఘరం మసాలా, ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు రుచికి సరిపడ, వెల్లుల్లి పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, నూనె, కొత్తిమీర తరిగినది, నాలుగు పచ్చిమర్చీలు.

తయారీ విధానంలోకి వెళితే..మందుగా చాలా పెద్ద సైజులో ఉండే వంకాయలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని చేప ముక్కల ఆకారంలో, చాలా పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో చిన్న చిన్నగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో రెడ్ మిర్చీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ధనియాలు, యాలకులు, లవంగాలు, కస్తూరీ మేతీ, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి.

ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో కారం పొడి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం కొంచెం, కారం, రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. నూనె పోసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకోవాలి. వాటిని ఒక్కో ముక్కకు నిండుగా కారం పూర్తిగా పట్టే విధంగా వంకాయ పెట్టాలి. వంకాయకు రెండు వైపులా పూర్తిగా కారం పట్టించాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా అన్ని వంకాయ ముక్కలకు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి.

వాటిపై చిన్న చిన్గా తరిమిన కొత్తిమీర తీసుకొని చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. పెద్ద పాన్ పెట్టాలి. తర్వాత నూనె పోయాలి. వంకాయలను వేయించుకోవడానికి సరిపడ నూనె పోయాలి. అందులో వంకాయ ముక్కలు వేసి మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. మధ్యలో పచ్చి మిర్చీ వేయండి. ఇలా చేయడం వలన రుచి బాగుంటుంది. ఫ్రై అయ్యిందంటే, అంతే టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై రెడీ.