Fig Health Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తింటున్నారా..? ఏమవుతుందో తెలిస్తే..

|

Dec 10, 2024 | 8:21 AM

తియ్యటి రుచితో ఉండే అంజీర్‌ పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా నిండివున్నాయి. అంజీర్‌ పండ్లను ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. లేదా రెండు పూటలూ తక్కువ మోతాదుతో తీసుకోవచ్చు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తీసుకుంటే ఏమవుతుందో తప్పక తెలుసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ఉదయాన్నే ఖాళీ పొట్టతో అంజీర్ తినడం వల్ల దాని సహజ చక్కెరల కారణంగా త్వరగా శక్తిని పొందవచ్చు. ముఖ్యంగా శరీరంలో శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు. అత్తి పండ్లతో పాలు తీసుకోవడం మంచి శక్తి వనరు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉంటారు.

2 / 5
అంజీర్ పండ్లలో కాల్షియం ఎక్కువ శాతం ఉంటుంది. దీంతో అంజీర్‌ పండ్లు తింటే ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం అంజీర్ పండ్లు తింటే ఎముకలు ధృడంగా ఉంటాయి. ఎముకల బలహీనత సమస్య ఉన్నవారు రోజు 2-3 పండ్లను తింటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరంలో ఉన్న మలినాలను తొలగించడంలో అంజీర్ పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

3 / 5
అంజీర్‌ పండ్లలో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అంజీర పండ్లను తినడం వల్ల రక్తపోటు సమస్యలు రావు. రక్తపోటును ఇది అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే గుండెకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4 / 5
అంజీర్‌తో పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సరిగా ఉండడానికి బాగా పనిచేస్తుంది. అసిడిటీ, అజీర్ణం, గ్యాస్ మొదలైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రతి రోజు 2-3 అంజీర్ పండ్లను తేనెతో కలిపి తీసుకుంటే కడుపు ఖాళీ అవుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరి చేరవు.

5 / 5
అంజీర్‌ పండ్లు తింటే ఆరోగ్యమే కాకుండా అందంగా మారతారు. మొటిమలతో ఇబ్బందులు పడుతున్నవారికి అంజీర్ పండ్లతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంజీర్ పండ్లను మెత్తగా నూరి ఆ పేస్ట్‌ను మొటిమలకు అప్లై చేయాలి. ఆకులు కూడా వాడవచ్చు. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.