
ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఎన్నో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. మొఖంపై మొటిమలు, చర్మం పొడిబారడం, ముడతలు వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యమైన ఆహారమే తీసుకొవడంతో పాటు ఫేస్ ప్యాక్స్ కూడా ఉపయోగించాలి. మీ చర్మ సౌందర్యాన్ని కాపాడే ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె: రాత్రంతా నానబెట్టిన బాదంపప్పు పేస్ట్‌లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కాసేపు అలాగే ఉంచి ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడాను మీరే గమనిస్తారు.

ఓట్స్: చర్మంలోని మురికిని తొలగించడానికి ఓట్స్‌లో పెరుగు కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించాలి. చర్మంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

బొప్పాయి: ఈ హోం రెమెడీని తీసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలే కాకుండా ట్యాన్ కూడా తొలగిపోతుంది. బొప్పాయిని తీసుకుని మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.

రైస్: దీన్ని నేచురల్ స్క్రబ్ అంటారు. మూడు చెంచాల బియ్యప్పిండిని తీసుకుని దానికి రెండు చెంచాల రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయడం ద్వారా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది.

పచ్చి పాలు: ఇవి ముఖాన్ని తేమగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతాయి. ఒక గిన్నెలో 4 నుంచి 5 చెంచాల పచ్చి పాలను తీసుకుని వాటికి ఒక చెంచా సెమోలినా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖంపై అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయాలి. తర్వాత సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది.