Amla Juice: ఉసిరితో ఆరోగ్య సిరి.. రోజూ పొద్దునే గ్లాసుడు జ్యూస్‌ తాగితే సరి

Updated on: Nov 03, 2025 | 1:11 PM

Promising Health Benefits of Amla Juice: శీతాకాలంలో ఎన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా జలుబుతో సహా అనేక సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకే శీతాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా ఈ కాలంలో ఆరోగ్యం క్షీణించే అవకాశం తక్కువగా ఉంటుంది..

1 / 5
జుట్టు, చర్మానికి ఉసిరి అత్యంత ప్రయోజనకరమైనది. ఉసిరి తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి.

2 / 5
శీతాకాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఓ స్పెషల్ పానీయం తాగాలి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

3 / 5
అదే ఉసిరి. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే సంగతి అందరికీ తెలుసు. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది అనేక ఆరోగ్య సమస్యలకు శాశ్వత నివారిణి కూడా.

4 / 5
ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఉసిరి రసం తాగాలి. దీనిని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా ఒక మీడియం సైజు ఉసిరి తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని వడకట్టి గ్లాసుడు నీళ్లలో కలిపి తాగితే సరిపోతుంది.

5 / 5
ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ  కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది.