
పప్పు దినుసులను మనం సరిగ్గా ఉండకపోతే జీర్ణం కాదు. ఆ తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువతాయి. తిన్నది జీర్ణం కాక ఆ తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అసలు, మన ఆరోగ్యానికి ఏ పప్పులు మంచివో? ఏవి మంచివి కావో ఇక్కడ తెలుసుకుందాం..

మసూర్ పప్పు అంటే ఎర్ర పప్పు. చాలా మంది దీనిని టమాటలతో కలిపి వండుతారు. దీనిని తిన్నా కూడా ఎలాంటి గ్యాస్ సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఇది మిగతా పప్పుల కంటే ఇది చాలా బెటర్.

మనం తినే అన్ని పప్పుల్లో పెసర పప్పు చాలా మంచిది. దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అలాగే, వీటిని తిన్న వెంటనే అవి జీర్ణ మవుతాయి. కాబట్టి, ఇదే మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.

మినప పప్పు కూడా మన జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఇది యాసిడ్ ఉత్పత్తి చేసి సరిగా జీర్ణం కానివ్వదు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, దీనిని అతిగా తినకండి.

కంది పప్పును వారంలో నాలుగు సార్లు తినే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్లు ఇక నుంచి తినే తప్పుడు జాగ్రత్త. ఎందుకంటే, ఇది గ్యాస్ సమస్యలను పెంచుతుంది. ఇంకా కడుపును కూడా ఇబ్బంది పెడుతుంది.