
మనలో చాలా మందికి మందార పువ్వు గురించి తెలుసు. ఇది ఆకర్షణను మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో మందార పువ్వును అధికంగా ఉపయోగించేవారు. ఈ క్రమంలో మందార పూలతో చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మందారలో యాంటీఆక్సిడెంట్లు,యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మీరు తాజా మందార ఆకులు, దాని ఎండిన ఆకులను ఉపయోగించి టీ తయారు చేయవచ్చు. అందులో తేనె కలుపుకుని తాగాలి.

గుండెకు మేలు చేసే చెడు కొలెస్ట్రాల్ గుండెకు చాలా ప్రమాదకరం. మందారలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అంతేకాదు, మందార పూలతో తయారు చేసిన హెర్బల్ టీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మందార పువ్వులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీపరాసిటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మందార పూలతో చేసిన టీని తాగితే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనేక రకాల శారీరక ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.

మందార ఆకుల ఇథనాల్ సారం యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. మందార టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహంలో మందార చాలా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు మందార టీ తీసుకోవచ్చు. హైబిస్కస్ టీలో అమైలేస్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇది బరువును తగ్గిస్తుంది.