
లైంగిక అవసరాలకు సంబంధించి సరైన ఆరోగ్యకరమైన సంభాషణను తెలియజేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో యువకులు తరచుగా సెక్స్టింగ్‌లో పాల్గొంటారు. వాస్తవానికి.. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2017 అధ్యయనం ప్రకారం.. 40.5% మంది పురుషులు, 30.6% మంది స్త్రీలు లైంగిక సంభాషణలో నిమగ్నమయ్యారు.

ఆరోగ్యకరమైన సంబంధం ఎలా ఉంటుందో పిల్లలతో మాట్లాడటం ప్రారంభించాలి. సెక్స్ విషయాల గురించి ప్రస్తావించకుండా మంచి డిజిటల్ పౌరుడిగా ఎలా ఉండాలనే దాని గురించి వారితో మాట్లాడటం అవసరం. సెక్స్‌కు సంబంధించి ఎదుర్కొనే అన్ని అవకాశాల గురించి మాట్లాడాలి.

పిల్లలు కౌమర దశలో ఉన్నప్పుడు సెక్స్ కు సంబంధించిన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో వారు చేస్తున్న పని పట్ల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. వారితో ఏదైనా చెప్పే ముందు ప్రశాంతంగా ఉండాలి. అతిగా ప్రతిస్పందిస్తే.. పిల్లలు భయపడే అవకాశం ఉంది.

మీ పిల్లలతో వాట్-ఇఫ్‌ల గేమ్ ఆడటం, ఎవరైనా నగ్నంగా వారిపై ఒత్తిడి చేస్తే ఏమి చేస్తారని ప్రశ్నించడం వంటివి చేయాలి. ఆ విషయాలను వీలైనంత కామన్ గా చేసేందుకు ప్రయత్నించాలి.

పిల్లలు వారి ఫోన్‌లలో నగ్న ఫోటోలు లేదా ఎవరైనా మైనర్ ఫోటోలు కలిగి ఉంటే, ఆ చిత్రాన్ని ఎందుకు తొలగించాలో వివరించాలి. కానీ మీరు చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. టీనేజ్‌తో కష్టతరమైన సంబంధం ఉన్నట్లయితే.. పెద్దవారు జోక్యం తీసుకోవడం చాలా అవసరం.