16వేల మొక్కలతో ఆకుపచ్చని అవతారంలో లంబోదరుడు.. అనకాపల్లిలో కనువిందు చేస్తున్న సస్య గణపతి

Edited By:

Updated on: Sep 14, 2026 | 3:27 PM

అనకాపల్లిలో సస్య గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించేలా మొక్కలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అంతేకాదు ఆ మండపం, పరిసర ప్రాంతాలు కూడా మొక్కలతో అలంకరించారు. చింతామణి గణపతి దత్తక్షేత్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సస్య గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.

1 / 5
మొక్కలతో ప్రత్యేకంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల ద్వారా భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

2 / 5
16  వేల మొక్కలతో గణపతి విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు కానీ.. అంతకుమించి ఈ వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు మొక్కలు వినియోగించారు. 21 అడుగుల ఎత్తు వరకు విగ్రహం తీర్చిదిద్దారు . వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు.

3 / 5
అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా మరో 60 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం, ప్రతిమను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

4 / 5
ఈ సస్య గణపతి విగ్రహం కోసం మొక్కలను కడియపులంకలో పెంచారు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ప్రత్యేకంగా వినాయక చవితి కోసం తీసుకువచ్చారు. మిగిలిన అలంకారం మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి, వాటిలో విదేశీ మొక్కలు కూడా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

5 / 5
సస్య గణపతి మొక్కల అలంకారంతోపాటు వాటర్ఫాల్, కొలను ఏర్పాటు చేసి అందులో చేపలు వేశారు. దీంతో పాటు పక్షులను కూడా ఆ ప్రాంతంలో ఉంచారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సస్య గణపతి ద్వారా ప్రజలకు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణహిత ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ గణపతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకు భక్తులకు సస్య గణపతి దర్శనమిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us