
ప్రతి రోజూ ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యం. రాత్రి భోజనం తిన్న చాలా గంటల తర్వాత మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తింటారు. ఈ సమయంలో శరారానికి కావాల్సిన పోషకాలు అందించాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిది. అలాగే మార్నింగ్ తీసుకునే ఆహారాల్లో కొన్నింటిని యాడ్ చేసుకోవడం వల్ల చర్మానికి కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బెర్రీస్ జాతికి చెందిన పండ్లను ఉదయం తినడం వల్ల చర్మానికి చాలా మంచిది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి వచ్చే నష్టాన్ని చర్మానికి కలిగించవు. మార్నింగ్ ఓట్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇవి చర్మాన్ని సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా ఉంచుతాయి.

అవకాడోల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. ఇవి మీ బ్రేక్ ఫాస్ట్‌లో యాడ్ చేసుకుంటే స్కిన్ కాంతివంతంగా అవుతుంది. అదే విధంగా ఉదయం గుడ్లు తినడం వల్ల కూడా ఆరోగ్యమే కాకుండా.. చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. గుడ్లలో విటమిన్లు ఎ, ఇలు ఉంటాయి. ఇవి స్కిన్‌కి అవసరం అయిన పోషకాలను అందిస్తుంది.

ఉదయం గ్రీట్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేసి, సాఫ్ట్‌గా ఉంచుతాయి. అలాగే త్వరగా వృద్ధాప్యం దరి చేరకుండా చేస్తుంది.

ఉదయం నానబెట్టిన వాల్నట్స్ తీసుకుంటే చాలా మంచిది. ఇందులో ఎండు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. చర్మంపై మంటను తగ్గించి, హైడ్రేట్‌గా చేస్తుంది. అలాగే వృద్ధాప్యం, సూర్య రశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయ పడుతుంది.