1 / 5
'పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి' అన్నారు పెద్దలు. అలా తినే విషయంలో, బుద్ధి విషయంలో ఎవరి ఇష్టం వాళ్లకు ఉంటుంది. ఒక్కొక్కరు స్పైసీ ఫుడ్ ని ఇష్ట పడతారు. మరి కొందరు కారం తక్కువగా తింటారు. ఇంకొందరు పుల్లగా, తియ్యగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. ఇతర దేశాల సంగతి పక్కకు పెడితే భారత దేశంలో మాత్రం ఘాటు లేకుండా ఆహారం అస్సలు నోటికి రుచించదు. అయితే కారం తక్కువ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.