Disadvantages Of Eating Rice: మూడు పూటలా అన్నం తింటున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..

|

Nov 13, 2023 | 8:02 PM

ప్రపంచంలో అత్యంత అధిక మంది తీసుకునే ఆహారాల్లో అన్నం ఒకటి. వైట్ రైస్ అనేక రకాలుగా వంటలకు వినియోగిస్తుంటారు. బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. దక్షిణాది భారత దేశంలోని వారికి మాత్రం అన్నం తినకుండా పూటకూడా గడవదు. ఇక్కడి వారికి అన్నం ప్రధాన ఆహార వనరు. అయితే అన్నాన్ని ఎక్కువగా తినడం చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి తగిన మోతాదులో పీచు అందకపోతే మలబద్ధకం సమస్య..

1 / 6
ప్రపంచంలో అత్యంత అధిక మంది తీసుకునే ఆహారాల్లో అన్నం ఒకటి. వైట్ రైస్ అనేక రకాలుగా వంటలకు వినియోగిస్తుంటారు. బియ్యంతో తయారు చేసిన ఆహార పదార్థాలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. దక్షిణాది భారత దేశంలోని వారికి మాత్రం అన్నం తినకుండా పూటకూడా గడవదు. ఇక్కడి వారికి అన్నం ప్రధాన ఆహార వనరు. అయితే అన్నాన్ని ఎక్కువగా తినడం చాలా హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 6
శరీరానికి తగిన మోతాదులో పీచు అందకపోతే మలబద్ధకం సమస్య తలెత్తవచ్చు. పప్పు, కూరగాయలు, గోధుమలు, జొన్నలు, మినుములను భోజనంలో చేర్చుకోవాలి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్ లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లటి అన్నం తక్కువగా తినాలి.

3 / 6
వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీలు తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతాయి. బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వైద్యుల సలహా మేరకు వైట్ రైస్ తినడం బెటర్.

4 / 6
ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ పోషకాల లోపం వల్ల ఎముకలు, దంతాలు, అనేక సమస్యలకు దారితీస్తుంది. పోషకాహార లోపం అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. అదేపనిగా అన్నం తింటే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.

5 / 6
తెల్ల బియ్యం రక్తంలో చక్కెర శాతంను పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినకూడదని తరచుగా వైద్యులు చెబుతుంటారు.

6 / 6
బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వైట్ రైస్ తినడం వల్ల డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు అన్నం తినకుండా నివారించాలి.