క్రీమ్ బిస్కెట్లలో కొవ్వు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కారణంగా వీటిని తింటే బరువు పెరుగుతారు. ఇంకా మన రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
క్రీమ్ బిస్కెట్ల కారణంగా బరువు పెరగడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఫలితంగా గుండెపోటు, రక్తపోటు సంభవించే అవకాశం పెరుగుతుంది.
క్రీమ్ బిస్కెట్ల నిల్వ కోసం వీటి తాయారీలో బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీయానిసోల్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్ అనే రెండు పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి మానవ శరీరానికి చాలా హానికరం.
అలాగే ఉప్పగా ఉండే క్రీమ్ బిస్కెట్లను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇంకా ఇందులోని సోడియం కార్బొనేట్ బీపీ సమస్యలకు దారితీస్తుంది.
బిస్కెట్లను ప్రాథమికంగా పిండితో తయారు చేస్తారు. ముఖ్యంగా మైదాతో తయారు చేసే క్రీమ్ బిస్కెట్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రెడ్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెలో మంట, డయాబెటీస్ సమస్యలు ఎదురవుతాయి.