Boiled Peanuts: ఉడికించిన వేరుశనగ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

Updated on: Jan 13, 2025 | 5:49 PM

వేయించిన పల్లీల కంటే ఉడికించిన పల్లీలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. షుగర్ వ్యాధి, రక్త పోటు రాకుండా అడ్డుకుంటాయి. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి..

1 / 5
కానీ నానబెట్టిన పల్లీలు తింటే కొంతమందికి అలెర్జీలు, కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి వీటిని అతిగా తినవద్దు. ఏదైనా ఆహారం పరిమితంగా తింటేనే అది అమృతంతో సమానం. కాబట్టి తినే ముందు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే, ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగలను తినడం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందువల్ల, తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

2 / 5
నానబెట్టిన వేరుశనగ పల్లీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. పల్లీలను నానబెట్టి తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గి కడుపు శుభ్రపడుతుంది. నానబెట్టిన పల్లీల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా శరీరాన్ని శక్తివంతం చేస్తాయి.

3 / 5
వ్యాయామం చేసే లేదా శారీరక శ్రమ చేసే వారికి నానబెట్టిన పల్లీలు తినడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. పల్లీలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 5
నానబెట్టిన పల్లీలు డయాబెటిస్ రోగులకు మంచి ఆహారంగా పరిగణించబడతాయి. ఎందుకంటే వాటిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం పుష్కలంగా ఉంటుంది. నానబెట్టిన పల్లీలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.

5 / 5
శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించడంలో మెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేసేలా చేస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించడంలో మెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేసేలా చేస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)