

పెరుగు: జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచి, సమస్యలకు చెక్ పెడుతుంది.

వోట్స్: వోట్స్ అనేవి స్నాక్ ఫుడ్. ఈ ఆహారంం బరువు తగ్గాలనుకునేవారికి వరం లాంటిది. ఇక జీర్ణ సమస్యలు ఉన్నవారు వోట్స్ తినడం మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.

అరటిపండు: అరటిలో ఉండే సహజ యాంటాసిడ్, పొటాషియం కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

అల్లం టీ: కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగితే చక్కని ఫలితాలు ఉంటాయి. అల్లం టీ కారణంగా శరీర రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడి, ఇలాంటి సమస్యలు ఎదురుకావు.