
పోషకాలు: అరటికాయలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అరటి పండ్లను నేరుగా లేదా కూర రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.

బరువు నియంత్రణ: ముందుగా చెప్పుకున్నట్లు అరటికాయతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఇందులోని అధిక స్థాయి రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేందుకు పనిచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

గుండె ఆరోగ్యం: అరటికాయ ద్వారా శరీరానికి అధిక మొత్తంలో లభించే పొటాషియం రక్త నాళాలు, ధమనులపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు నివారిస్తుంది . ఫలితంగా గుండెపోటు, హార్ట్ స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

షుగర్ కంట్రోల్: అరటికాయ ద్వారా లభించే అధిక స్థాయి విటమిన్ బి6, ఫైబర్ ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ రోగుల రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం తప్పుతుంది.

జీర్ణక్రియ: అరటికాయలో డైటరీ ఫైబర్ ఉన్నందున ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఫలితంగా మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.