
మంచి రోజులు వచ్చేశాయి. అధిక జ్యేష్ఠ్య మాసం కూడా పూర్తి అవ్వడంతో ఈ సమయంలో చాలా మంది శుభ కార్యాలు జరుపుకుంటున్నారు. అయితే ఏ చిన్న వేడుక జరిగినా సరే స్వీట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా పూజా కార్యక్రమాలలో ప్రసాదం చాలా రుచిగా వండాలి అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం టెంపుల్ స్టైల్ ప్రసాదం రుచిని మించిపోకుండా తమిళనాడు స్టైల్ సెక్కరై పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : బెల్లం, బియ్యం, పెసరపప్పు, పచ్చ కర్పూరం, పాలు, నీళ్లు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, యాలకులు, యాలకుల పొడి, ఎండు ద్రాక్ష. వీటన్నింటితో అదిరిపోయే స్టైల్‌లో స్వీట్ చాలా సులభంగా తయారు చేయవచ్చును.

తయారీ విధానంలోకి వెళితే.. తయారీ విధానంలోకి వెళితే స్వీట్ చేయడానికి రెండు గంటల ముందే బియ్యం, పెసర పప్పు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, పెసరపప్పును మంచిగా కడిగి, కుక్కర్‌లో వేసుకోవాలి. ఇందులోనే పాలు, నీళ్లు, యాలకులు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు మంచిగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో కప్పు బెల్లానికి, కప్పున్నర నీళ్లు పోసి బెల్లం కరికే వరకు మంచిగా కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ నీటిని తీసుకొని, రైస్, పెసరపప్పు ఉడకబెట్టిన కుక్కర్ బౌల్‌లో వేసి , స్టవ్ పై పెట్టి బెల్లం నీరు అన్నంలో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పచ్చ కర్పూరం వేయాలి. దీని వలన స్వీట్, ప్రసాదం ఫ్లేవర్ వస్తుంది. ఇవి బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరొక పాన్ పెట్టి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష అన్నీ వేసి మంచిగా వేయించుకోని వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం అన్నం మిశ్రమంలో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ సెక్కరై పొంగల్ రెడీ.