
చాలా మంది రాగితో చపాతీ, దోసెలు, రాగి సంగటి ఇలా అనేక రకాల వంటలు చేసుకుంటారు. ఇక రాగితో స్వీట్ చేయడం చాలా తక్కువ. కానీ రాగి పిండితో స్వీట్ చేయడం వలన అది మంచి రుచిగా ఉండటమే కాకుండా, రక్తహీనత సమస్యను తరిమికొడుతుందంట. కాగా, రాగులతో స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

రాగి స్వీట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, బెల్లం తురుము, నీళ్లు, పాలు ఒక కప్పు, అర కప్పు నెయ్యి, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు.

తయారీ విధానం : స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ పెట్టాలి. పాన్ వేడి అయిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేసి రాగి పిండిని మంచిగా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు, వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా ఇప్పుడు అందులోనే బొంబాయి రవ్వను కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్ తీసుకొని అందులో బెల్లం, రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో రాగి పిండి, బొంబాయి రవ్వ వేసి మంచిగా కలుపుకోవాలి. అదే విధంగా అందులోనే బాదం, జీడిపప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బెల్లం నీటితో రాగి పిండి మంచిగా కలిసి మెత్తగా అవుతుంది.

ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నిండుగా నెయ్యి పూసి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసుకోవాలి. అంతే దీనిని మీకు నచ్చిన ఆకారంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాగి బర్ఫీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టం తింటారు అంతే కాకుండా ఇది రక్తహీనత సమస్యను కూడా తరిమికొట్టి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.