Stroke: కాఫీ, కూల్‌ డ్రింక్‌ అధికంగా తాగితే స్ట్రోక్‌ రిస్క్‌.. సైంటిస్టుల హెచ్చరిక

|

Oct 12, 2024 | 1:39 PM

ఆరోగ్యంగా ఉండాలంటే కార్బోనేటేడ్ డ్రింక్స్, కృత్రిమ పండ్ల రసాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వీటిపి తీసుకోవడం వల్ల స్ట్రోక్ రిస్క్ మరింత పెరుగుతుందట. ఒక వ్యక్తి ప్రతిరోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగినా.. అది స్ట్రోక్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంఔ వెల్లడించింది..

1 / 5
ఆరోగ్యంగా ఉండాలంటే కార్బోనేటేడ్ డ్రింక్స్, కృత్రిమ పండ్ల రసాలకు దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వీటిపి తీసుకోవడం వల్ల స్ట్రోక్ రిస్క్ మరింత పెరుగుతుందట. ఒక వ్యక్తి ప్రతిరోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగినా.. అది స్ట్రోక్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంఔ వెల్లడించింది.

2 / 5
రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే స్ట్రోక్ ముప్పు చాలా రెట్లు పెరుగుతుందని ఈ పరిశోధన సారాంశం. అంతేకాదు కృత్రిమ స్వీట్నర్‌లు కలిపే శీతల పానీయాలతోనే ఇదే విధమైన రిస్క్‌ ఉంటుందట. మెక్‌మాస్టర్ యూనివర్సిటీ కెనడా, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే.. కాఫీ, చక్కెర పానీయాలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కార్బోనేటేడ్ పానీయాలు, కృత్రిమ పండ్ల రసాలను తీసుకోవడం వల్ల స్ట్రోక్ ముప్పు 37 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

3 / 5
మరొక అధ్యయనం ప్రకారం.. చక్కెరతో చేసిన కార్బోనేటేడ్ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాన్ని 22 శాతం పెంచుతాయి. ఈ పరిశోధన జర్నల్ ఆఫ్ స్ట్రోక్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రోక్‌లో ప్రచురణ అయ్యాయి. ఈ ప్రాజెక్టులో 27 దేశాల నుంచి 27 వేల మంది పాల్గొన్నారు. వారిలో 13,500 మందికి మొదటిసారిగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ఈ పానీయాలు తీసుకోకపోవడమే మంచిది.

4 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెదడులోని ఏదైనా భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు, మెదడు కణాలు దెబ్బతిన్నప్పుడు స్ట్రోక్‌ తలెత్తుతుంది. అటువంటి పరిస్థితిలో ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవించవచ్చు. ఇది సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ఇది మెదడులో అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.

5 / 5
కృత్రిమ పండ్ల పానీయాలలో అదనపు చక్కెర, ప్రిజర్వేటివ్‌లు ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా, స్ట్రోక్ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఊబకాయం లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న మహిళల్లో  స్ట్రోక్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాఫీ లేదా టీని పూర్తిగా మానుకోలేకపోయినప్పటికీ.. ఈ అలవాటును తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగవచ్చు. ఇవి హానిచేయనివి. వీటిల్లో పాలకు బదులుగా, బాదం, సోయా లేదా ఓట్స్‌తో చేసిన పాలను తాగవచ్చు.