Health tips: ధనియాల నీటిని ఇలా రోజూ తాగండి…ఫలితం మామూలుగా ఉండదుగా..

Updated on: Feb 22, 2025 | 10:36 AM

Health tips : వంట గదిలో ఉండే రకరకాల మసాలా దినుసుల్లో ధనియాలు కూడా ఒకటి. దాదాపు అన్ని రకాల వంటకాల్లో కొత్తిమీర, ధనియాలను సువాసన కోసం వినియోగిస్తుంటారు. ధనియాల్లోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ధనియాలను కేవలం వంటల్లో ఉపయోగించడం ద్వారా మాత్రమే కాకుండా.. ధనియాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను ఉదయాన్నే తాగితే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఇన్సులిన్ అనేది క్లోమం ద్వారా తయారు చేయబడిన హార్మోన్. ఇది మీ శరీరం చక్కెరను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇన్సులిన్ లోపం ఏర్పడినప్పుడు, ఎంత చక్కెర జీవక్రియ చేయబడాలో శరీరం చెప్పలేకపోవచ్చు, దీని వలన రక్తంలో చక్కెర పెరుగుతుంది. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2 / 5
కొత్తిమీర రసం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీరలో విటమిన్లు ఎ, సి, కె లు లభిస్తాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి.

3 / 5
ధనియా వాటర్‌ థైరాయిడ్‌ బాధితులకు కూడా మేలు చేస్తుంది. వీరు క్రమం తప్పకుండా కొత్తిమీర నీరు తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి. ఇది థైరాయిడ్ నియంత్రణలో సాయపడుతుంది. థైరాయిడ్ మందులను తీసుకున్న గంట తర్వాతే ఈ నీటిని తీసుకోవాలి.

4 / 5
ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకుంటే జుట్టు రాలుడు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 5
కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు కూడా ధనియాల నీటిని రోజూ పరగడుపున తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ధనియాల నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.