Tomatoes Vs Kidney Stones: ఆహారంలో టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఇటీవలి కాలంలో అనేక మందికి కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇందుకోసం టమోటాలు తినకుండా ఉండాలని భావిస్తుంటారు. ఎందుకంటే చాలా మంది టమోటాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల లేదంటే ఆహారంలో ఏదో ఒక విధంగా ఉపయోగించడం వల్ల..

Tomatoes Vs Kidney Stones: ఆహారంలో టమాటాలు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Can Eating Tomatoes Trigger Kidney Stones

Updated on: Dec 07, 2025 | 8:29 PM

ఇటీవలి కాలంలో అనేక మందికి కిడ్నీలో రాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇందుకోసం టమోటాలు తినకుండా ఉండాలని భావిస్తుంటారు. ఎందుకంటే చాలా మంది టమోటాలను పెద్ద మొత్తంలో తినడం వల్ల లేదంటే ఆహారంలో ఏదో ఒక విధంగా ఉపయోగించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నమ్ముతారు. మరికొంత మంది మూత్రపిండాల్లో రాళ్లు కనిపించిన తర్వాత టమోటాలు తినడం మానేస్తారు. అయితే టమాటాలు తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా? లేదా? అనే విషయం నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

నిజానికి, టమోటాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. టమోటాలలో ఉండే ఆక్సలేట్ కంటెంట్ వల్ల కిడ్నీలో రాళ్లు వస్తాయని సాధారణంగా నమ్ముతారు. అయితే ఈ కూరగాయలో చాలా తక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. అంటే 100 గ్రాముల టమోటాలలో కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ మొత్తంలో కిడ్నీలో రాళ్లు రావడానికి సరిపోదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే అంశాలు ఇవే..

సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. ప్రతిరోజూ కనీసం 2.5 నుంచి 3 లీటర్ల నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని ఎంజైమ్‌ల లోపాలు, జీవక్రియ సమస్యల వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.
ఆక్సలోసిస్ అనే అరుదైన జీవక్రియ రుగ్మత కారణంగా మూత్రపిండాలు శరీరం నుంచి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా విసర్జించడం ఆపివేస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
కొన్నిసార్లు కాల్షియం ఆక్సలేట్‌తో పాటు, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ రాళ్ళు, సిస్టీన్ రాళ్ళు వంటి ఇతర రకాల స్ఫటికాల వల్ల కూడా రాళ్ళు ఏర్పడతాయి. అలాగే కొన్ని మాంసాహార పదార్థాల వినియోగం కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు.

మీరు మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అయితే అంత కంటే వైద్యుడి సలహా మేరకు మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారాల విషయంలో కూడా వైద్య సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/health

1690836,1690967,1691071,1690890