Kitchen Tips: ఆహారాలకు చీమలు, పురుగులు పట్టకుండా ఉండాలా.. ఈ టిప్స్ మీకోసమే!

| Edited By: Ram Naramaneni

Nov 12, 2023 | 9:34 PM

సాధారణంగా అందరి ఇళ్లల్లో ఎదుర్కొనే వాటిల్లో చీమల సమస్య కూడా ఒకటి. ఏ కాలమైనా చీమలు మాత్రం అంత తేలిగ్గా వదలవు. ఏ ఆహారాలను వదిలి పెట్టవు. స్వీట్ ఐటెమ్స్ కనిపించడమే లేటు.. వెంటనే క్యూ కట్టేస్తాయి. ఎన్ని సార్లు ప్లేసులు మార్చినా, మందులు వాడినా అవి కూడా వెంటాడుతూనే ఉంటాయి. దీంతో గృహిణులకు ఇదొక సమస్యగా మారుతుంది.

1 / 5
సాధారణంగా అందరి ఇళ్లల్లో ఎదుర్కొనే వాటిల్లో చీమల సమస్య కూడా ఒకటి. ఏ కాలమైనా చీమలు మాత్రం అంత తేలిగ్గా వదలవు. ఏ ఆహారాలను వదిలి పెట్టవు. స్వీట్ ఐటెమ్స్ కనిపించడమే లేటు.. వెంటనే క్యూ కట్టేస్తాయి. ఎన్ని సార్లు ప్లేసులు మార్చినా, మందులు వాడినా అవి కూడా వెంటాడుతూనే ఉంటాయి. దీంతో గృహిణులకు ఇదొక సమస్యగా మారుతుంది. అయితే ఈ సారి ఈ టిప్స్ ఫాలో అయి చూడండి.

2 / 5
వెనిగర్: చీమలు, కీటకాల సమస్య ఎక్కువగా ఉంటే.. చిన్న కాటన్ బాల్స్ తీసుకుని వెనిగర్ లో ముంచి.. చీమలు, పురుగులు ఎక్కువగా తిరిగే చోట పెట్టండి. వెనిగర్ వాసనకు చీమలు, పురుగులు వెళ్లిపోతాయి. చిన్న పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి.

3 / 5
లవంగాలు: తేనె, పంచదార, బెల్లం చుట్టూ కూడా చీమలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిల్లో రెండు లవంగాలు వేసి చూడండి. దెబ్బకు పారిపోతాయి. లవంగాలు పప్పులు, బియ్యం, పిండి వాటిల్లో కూడా వేసుకోవచ్చు.

4 / 5
దాల్చిన చెక్క: ఎక్కువగా కిచెన్ లోని పంచదార డబ్బాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చీమలు పడుతూనే ఉంటాయి. దీంతో మహిలకు చిరాకు వస్తూ ఉంటుంది. ఈసారి పంచదార డబ్బాలో చిన్న దాల్చిన చెక్క పెట్టి చూడండి. దీని వాసనకు చీమలు పట్టవు.

5 / 5
బేకింగ్ సోడా -  బిర్యానీ ఆకులు: వంట గదిలో చీమలు, పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే.. బియ్యం, పప్పులు, గింజలు ఉన్న వాటిల్లో కలపండి. వండుకునేటప్పుడు బాగా శుభ్ర పరచుకోండి.  అలాగే బిర్యానీ ఆకులు కూడా పప్పులు, బియ్యం, గింజలు, పిండి వంటి వాటిల్లో వేస్తే చీమలు, పురుగులు పట్టకుండా ఉంటాయి.