
దిష్టి తగలకుండా, ప్రతి కూల శక్తుల నుంచి బయటపడటం కోసం చాలా మంది కాలికి నల్లటి దారం కట్టుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా ఎడుమ కాలికి నల్లదారం కడుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెద్దవారు, చిన్నవారు, స్త్రీలు, పురుషులు ఇలా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కాలికి నల్లటి దారం కట్టుకుంటున్నారు. కానీ ఇలా కట్టుకోవడం అస్సలే మంచిది కాదంట.

నలుపు రంగు అనేది శని గ్రహంతో ముడిపడి ఉంటుంది. శని గ్రహానికి చాలా ఇష్టమైన రంగు నలుపు రంగు. అయితే శని ఉండే స్థానం బట్టి, నలుపు రంగు అనేది కొందరికి కలిసివస్తే మరికొంత మందికి కలిసిరాదు. కాగా, ఇప్పుడు మనం నలుపు రంగు ఎవరికి ప్రమాదకరం అనే విషయాలను తెలుసుకుందాం.

ఎవరి జాతకంలో అయితే శని గ్రహం బలహీనంగా ఉంటాడో వారు నలుపు రంగు ధరిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. నలుపు రంగు అనేది వారి జాతకంలో అనేక ప్రతికూల ఫలితాలను ఇస్తుందంట. అందుకే శని బలహీనంగా ఉన్న వారు అస్సలే నలుపు రంగు ధరించకూడదు, ముఖ్యంగా, నల్లటి దారం కూడా కాలికి కట్టుకోవడం శుభకరం కాదంట.జ్యోతిష్య శాస్త్ర పండితుల ప్రకారం, ముఖ్యంగా రెండు రాశుల వారు నలుపు రంగు ధరించడం మంచిది కాదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి , ఈ రాశి వారికి అధిపతి కుజ గ్రహం, కుజ గ్రహానికి శని గ్రహానికి ఎప్పుడూ శత్రుత్వమే ఉంటుంది. అందువలన ఈ రాశి వారు అస్సలే నలుపు రంగు ధరించకూడదంట. అదే విధంగా వృశ్చిక రాశి వారికి కూడా కుజ గ్రహం అధిపతి. అందువలన వీరికి కూడా శని గ్రహం ఎప్పుడూ కూడా ప్రతి కూల ఫలితాలనే ఇస్తుంది. అందువలన ఈ రాశుల వారు ఎట్టిపరిస్థితుల్లో కూడా, నలుపు రంగు ధరించడం, చేతికి లేదా కాలికి నల్లటి దారం కట్టుకోవడం అస్సలే చేయకూడదంట.

అయితే నలుపు రంగు ఎవరికి సానుకూల ప్రయోజనాలు అందిస్తుందంటే? ఏ వ్యక్తి జాతకంలో అయితే శని గ్రహం బలంగా ఉంటుందో వారు నల్లటి వస్త్రాలు ధరించడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.