వేప చెట్టులో దుర్గాదేవి నివసిస్తుందని భావిస్తారు. దుర్గమ్మకు పూజ చేసే సమయంలో వేప చెట్టును కూడా పూజిస్తారు. భారత దేశంలోనే కాకుండా.. థాయిలాండ్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వేపను ఎంతో పవిత్రంగా భావిస్తారు.