Vitamin P: విటమిన్ P ఉంటుందని మీకు తెలుసా..? ఆరోగ్యానికి ఇది దివ్యౌషధం.. ఉపయోగాలేంటంటే…

Updated on: May 16, 2025 | 6:54 PM

విటమిన్ P. దీనిని బయోఫ్లవనాయిడ్స్ అని కూడా పిలుస్తారు. ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఒక ఫైటో న్యూట్రియంట్. ఈ విటమిన్ పి ప్రధానంగా మొక్కల నుంచి దొరికే ఆహారాలలో లభిస్తుంది. విటమిన్ P లోపం కూడా శరీరంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, విటమిన్‌ పి కలిగి ఉన్న ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే, ఈ విటమిన్‌ లాభాలు, ఏయే పదార్థాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
విటమిన్‌ పీ.. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ సి  ప్రభావాలను పెంచుతుంది. రక్త నాళాలను బలోపేతం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. నారింజ, నిమ్మ, బత్తాయి, ద్రాక్షపండ్లలో విటమిన్ సి అలాగే బయోఫ్లవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.అందుకే ప్రతిరోజూ కనీసం ఒక సిట్రస్ పండు తినమని వైద్యులు సూచిస్తున్నారు.

2 / 5
ఎరుపు, పసుపు బెల్ పెప్పర్స్ లో రుటిన్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కణాలకు శక్తినిస్తాయి. సలాడ్లు లేదా కూరల్లో బెల్ పెప్పర్స్ ను చేర్చండి. తద్వారా శరీరానికి తగినంత విటమిన్ పి లభిస్తుంది. ఇవి కణాలకు శక్తిని అందించడంలో సహాయపడతాయి. మీరు ఇవి సలాడ్లు, కూరల్లో చేర్చడం ద్వారా శరీరానికి తగినంత విటమిన్ పీని పొందవచ్చు.

3 / 5
గ్రీన్ టీలో కాటెచిన్స్,ఫ్లవనాయిడ్స్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇది చర్మానికి,గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను కూడా ఆలస్యం చేస్తుంది.రోజుకు 1 లేదా 2 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

4 / 5
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి బయోఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాటిని స్మూతీలు, ఓట్స్ లేదా స్నాక్స్ లో చేర్చండి. ఉల్లిపాయలు, ముఖ్యంగా ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే శక్తివంతమైన బయోఫ్లవనాయిడ్ ఉంటుంది. ఇది అలెర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గుండెను రక్షించడంలో సహాయపడుతుంది.

5 / 5
సోయా ఉత్పత్తులు, బ్లాక్బెర్రీస్, ద్రాక్ష, సోయాబీన్స్ మొదలైన వాటిలో విటమిన్ పి కనిపిస్తాయి. విటమిన్ పి తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. విటమిన్ పి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే ఆస్తమా, కీళ్లనొప్పులు, అలర్జీలను నివారిస్తుంది.