
పండుగలు అయినా, శుభ సందర్భాలు అయినా అమ్మాయిలు ఒంటినిండా నగలు ధరించి తెగ మురిసిపోతుంటారు. అమ్మాయిలకు ఆభరణాలతో విడదీయలేని సంబంధం ఉంటుంది. కష్ట సమయాల్లో ఉపయోగపడే ఈ ఆభరణాలు ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు. తమ దగ్గర రకరకాల నగల డిజైన్లు ఉన్నప్పటికీ, స్నేహితులు, చుట్టూ ఉన్న స్త్రీలు ధరించే నగలకు ఆడవాళ్లు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.

Gold



అందుకే స్నేహితులు ఎవరైనా తమ నగలు ఇస్తే వాటిని తీసుకోకండి. అలాగే మీ నగలు వారికి ఇవ్వకండి. ఎవరికైనా పొడి చర్మం, తామర, సోరియాసిస్, రింగ్‌వార్మ్ వంటి చర్మ సమస్యలు ఉంటే అవి నగల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ నగలను వేరే ఎవరైనా ధరించినట్లయితే, వాటిని అలాగే ఉపయోగించవద్దు. అత్యవసర పరిస్థితుల్లో మీ నగలను వేరొకరికి ధరించడానికి ఇవ్వవల్సి వస్తే ఇచ్చే ముందు వాటిని నీటిలో నానబెట్టి పలుచని గుడ్డతో తుడవడం మంచిది.