
సాధారణంగా పూజకు ఉపయోగించే కొన్ని రకాల వస్తువలును అస్సలు కింద పెట్టడం. ఒక వేళ కింద పడినా పూజకు ఉపయోగించరు. ఇలాంటివి ఇంట్లో లేదా బయట చూస్తూ ఉంటాం. అలా కింద పడినా, వస్తువులు కింద పెట్టినా అశుభంగా భావిస్తారు. కేవలం పూజ వస్తువులే కాకుండా కొన్ని రకాల వస్తువులు కూడా కింద పెట్టరు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది జంధ్యం ధరిస్తూ ఉంటారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలపై పెట్టరు. పెట్టనివ్వరు కూడా.. జంధ్యాన్ని తల్లదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారు. అలా పెట్టడం వల్ల వాళ్లను అవమానించినట్టు అవుతుంది.

అదే విధంగా బంగారాన్ని కూడా నేరుగా నేలపై పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ దేవికి ఆగ్రహం వస్తుందట. కింద పెట్టడం వల్ల ధనాన్ని అవమానించినట్టు అవుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి నేరుగా బంగారాన్ని కూడా నేలపై పెట్టకండి.

ఇక శివ లింగాలను కూడా నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేయడం వల్ల అన్నీ సమస్యలే ఎదురవుతాయట. కింద ఆకులు లేదా చెక్క లాంటి వస్తువులు ఉంచి దానిపై శివలింగాన్ని ఉంచాలి.

అలాగే దీపాలను కూడా నేరుగా నేలపై పెట్టరు. కింద ప్లేట్ లేదా ఏదన్నా ఆకు అయినా పెట్టి పెడతారు. నేరుగా దీపాన్ని కింద పెట్టడం వల్ల దేవతలను అవమానించినట్టు అవుతుందని భావిస్తారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )