Elephants Teeth: ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?

Updated on: Mar 21, 2026 | 7:43 PM

ఏనుగుకి రెండు పెద్ద దంతాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ దంతాలు కేవలం రక్షణ కోసం మాత్రమే. ఏనుగు నోటిలో ఇంకా దంతాలు ఉంటాయట. అసలు ఎన్ని దంతాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి ఏనుగుకు ఉండే పొడవాటి, ముందుకు పొడుచుకువచ్చే రెండు దంతాలు ప్రధానంగా ఆత్మరక్షణకు..

1 / 5
ఏనుగుకి రెండు పెద్ద దంతాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ దంతాలు కేవలం రక్షణ కోసం మాత్రమే. ఏనుగు నోటిలో ఇంకా దంతాలు ఉంటాయట. అసలు ఎన్ని దంతాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ఏనుగుకు ఉండే పొడవాటి, ముందుకు పొడుచుకువచ్చే రెండు దంతాలు ప్రధానంగా ఆత్మరక్షణకు, చెట్ల కొమ్మలను విరగ్గొట్టడానికి ఉపయోగపడతాయి. ఈ దంతాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడవు.

3 / 5
ఏనుగు నిజమైన తినే దంతాలు దాని నోటి లోపల, దవడ పక్కన (మోలార్లు) ఉంటాయి. ఈ దంతాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. ఏనుగుకు నోట్లో మొత్తం 26 దంతాలు ఉంటాయి.

4 / 5
వీటిలో 2 దంతాలు బయట కనిపిస్తాయి. 24 దంతాలు నోటి లోపల ఉంటాయి. ఏనుగు జీవితంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దాని దంతాలు ఒకటి రెండు సార్లు కాదు, ఏకంగా 6 సార్లు ఊడిపోయి తిరిగి పెరుగుతాయట.

5 / 5
ఒక దంతం అరిగిపోయి ఊడిపోయినప్పుడు, దాని స్థానంలో కొత్త దంతాలు పెరుగుతాయి. ఏనుగుల ఆహారం చాలా గట్టిగా, పీచుపదార్థంతో ఉంటుంది. ఈ ఆహారాన్ని నిరంతరం నమలడం వల్ల వాటి దంతాలు అరిగిపోయి, చివరికి విరిగిపోతాయి. ఆ తర్వాత వాటి స్థానంలో కొత్త దంతాలు తిరిగి పెరుగుతాయి.

Follow Us