e-Ration Card: ఎలాంటి కార్డు చూపెట్టకుండానే రేషన్ తీసుకోవచ్చు.. అదెలాగో ఈజీగా తెలుసుకోండి..

|

Dec 15, 2022 | 1:17 PM

దేశంలోని అధిక భాగం ప్రజలు ఇప్పటికీ ఇంటి నిర్వహణకు రేషన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ అందజేస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డు గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు.

1 / 6
దేశంలోని అధిక భాగం ప్రజలు ఇప్పటికీ ఇంటి నిర్వహణకు రేషన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం తక్కువ ధరకు రేషన్ అందజేస్తుంది. ఈ రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే రేషన్ వినియోగదారుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈ-రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది.

2 / 6
ఈ-రేషన్ కార్డ్ ఈనాటి సేవ కాదు. ఈ రేషన్ కార్డు సేవను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది. తొలి దశలో ఢిల్లీలో ఈ-రేషన్ కార్డు సదుపాయాన్ని తీసుకువచ్చారు. ఆ తరువాత ఈ రేషన్ కార్డు సేవ ఇతర రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టారు.

3 / 6
రేషన్ కార్డుల పంపిణీ సమస్యను మరింత సులభం చేయడానికి ఈ-రేషన్ కార్డ్ సర్వీస్ ను ప్రారంభించారు. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉన్న వారు ఈ-రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇ-రేషన్ కార్డు పొందిన తర్వాత మీరు రేషన్‌ను తీసుకోవడానికి కార్డు లేదా ఎలాంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. సులభంగా రేషన్‌ను తీసుకోవచ్చు.

4 / 6
రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..? ప్రతి రాష్ట్రం సొంత ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్‌సైట్‌ను కలిగి ఉంది. రేషన్ కార్డుకు సంబంధించిన మొత్తం సమాచారం nfsa.gov.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ హోమ్‌పేజీలో ప్రింట్ రేషన్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్, ఇతర వివరాలను ఫారమ్‌లో నింపండి.

5 / 6
ఇప్పుడు మీ ఇ-రేషన్ కార్డ్ అప్లికేషన్ PDS ద్వారా చెక్ అవుతుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, కార్డ్ స్థితిని చూడటానికి రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.

6 / 6
కార్డ్ జనరేట్ అయితే, మీరు వెబ్‌సైట్ నుండి కార్డ్ ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు..