
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో.. చాలామంది కడుపు సంబందిత సమస్యలతో బాధపడుతుంటారు. ప్రతిరోజు మందులు వాడినా ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకోరు. కానీ రెగ్యులర్‌గా ఈ కింది జ్యూస్‌లు తీసుకోవడం వల్ల ఈ జీర్ణ సమస్య నుంచి త్వరిత గతంగా బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

అనేక స్మూతీలు కూడా జీర్ణక్రియలో సహాయపడతాయి. వీటిల్లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తాయి.

కడుపు తేలికగా ఉంచడానికి చియా సీడ్ వాటర్‌కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఇది డిటాక్స్ వాటర్ జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.

ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం చాలా మంచిది. ఖాళీ కడుపుతో పాల టీ తాగడం కంటే అల్లం టీ వంద రెట్లు మేలు చేస్తుంది. కలబంద రసం కూడా కడుపుకు చాలా మంచిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌తో బాధపడేవారు ఈ జ్యూస్‌తో తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

పైనాపిల్ రసం కూడా కడుపుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో బ్రోమెలైన్ అనే ఉద్దీపనం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.