Diet For Hypertension: హైబీపీకి కేవలం మందులు మాత్రమే వేసుకుంటే సరిపోదు..! ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి

|

May 22, 2024 | 1:09 PM

నేడు ప్రపంచవ్యాప్తంగా జనాలను వణికిస్తోన్న రుగ్మత హైపర్‌ టెన్షన్‌.. అదేనండీ హైబీపీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిదక ప్రకారం దాదాపు 19 కోట్ల మంది భారతీయులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ వారిలో 37 శాతం మందికి మాత్రమే దీని గురించి కనీస అవగాహన ఉంది. అందులో 30 శాతం మంది మాత్రమే రక్తపోటుకు చికిత్స తీసుకుంటున్నారు..

1 / 5
నేడు ప్రపంచవ్యాప్తంగా జనాలను వణికిస్తోన్న రుగ్మత హైపర్‌ టెన్షన్‌.. అదేనండీ హైబీపీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిదక ప్రకారం దాదాపు 19 కోట్ల మంది భారతీయులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ వారిలో 37 శాతం మందికి మాత్రమే దీని గురించి కనీస అవగాహన ఉంది. అందులో 30 శాతం మంది మాత్రమే రక్తపోటుకు చికిత్స తీసుకుంటున్నారు.

2 / 5
సాధారణంగా రక్తపోటు 140/90 mmHg దాటితే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అర్థం. హైబీపీ వల్ల స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అధిక రక్తపోటు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి యేట మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాధారణంగా, అధిక రక్తపోటు ఉంటే ప్రతిరోజూ మందులు తీసుకోవల్సి ఉంటుంది. మందులతోపాటు సరైన ఆహారం కూడా తీసుకోవాలి.

3 / 5
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రక్తపోటు ఉన్న రోగులు DASH డైట్ అనుసరించాలి. అంటే కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే ఎక్కువగా పండ్లు, కూరగాయలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సీజనల్‌ పండ్లు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇది రక్తపోటును అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్లతో పాటు, ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. ఓట్స్, డాలియా, బ్రౌన్ రైస్, బార్లీ, మిల్లెట్ వంటి ఆహారాలను తప్పనిసరిగా తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి

4 / 5
శరీరంలో ప్రోటీన్ లోపాన్ని భర్తీ చేయడానికి చికెన్‌, సీఫుడ్ తినాలి. రెడ్ మీట్‌కు బదులుగా చికెన్ మంచిది. మొక్కల ప్రోటీన్ ఉన్న ఆహారాలు కూడా తీసుకోవచ్చు.

5 / 5
ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఒక వయోజన వ్యక్తి రోజువారీ ఆహారంలో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. మద్యపానం, ధూమపానం మానుకోండి. దీని ద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు.