ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో యాపిల్ ముందు వరుసలో ఉంటుంది. ఐతే కొందరు యాపిల్ పండ్లను తొక్కతో తినడానికి ఇష్టపడరు. దీంతో తొక్కను పూర్తిగా తీసి తింటుంటారు. నిజానికి.. యాపిల్ తొక్కలో ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పోషకాలతో నిండిన యాపిల్ తొక్కను వృద్ధాగా పారవేసే బదులు.. రుచి కరమైన స్నాక్స్ తయారు చేసుకోవచ్చని తెలుసా?
యాపిల్ తొక్కలు, దాల్చిన చెక్కతో టీ తయారు చేయవచ్చు. ఈ టీ రుచిగా ఉండటమేకాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక సీసాలో యాపిల్ తొక్కలు, చక్కెర, నీళ్లు పోసి నెల రోజుల పాటు చీకటి ప్రదేశంలో ఉంచితే యాపిల్ సైడర్ వెనిగర్ తయారవుతుంది.
యాపిల్ పీల్స్ తో చిప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. యాపిల్ తొక్కల్లో వెన్న, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకుని ఒవెన్‌లో 400 డిగ్రీల వేడిపై 12 నిముషాలపాటు ఉంచితే చాలు. కరకరలాడే చిప్ప్ రెడీ అయిపోతాయి.