
మార్కెట్‌లో డిమార్డ్ సమానంగా జనాలకు సరుకు అందించే స్టోర్స్ జాబితాలో జియో మార్ట్ ఒకటి. అవును ఈ స్టోర్ కూడా డిమార్ట్ మాదిరిగానే కొన్ని ప్రత్యేక వస్తువులపై ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇది బల్క్ ఆఫర్‌లను, పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేసినందుకు ప్రీ లేదా తక్కువ డెలివరీ ఛార్జీలను వేస్తుంది. మీరు జియో మార్ట్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచి సరుకులు ఆర్డర్ చేస్తే.. ఆఫర్‌లను బట్టి కొన్ని సార్లు ధరలు మారవచ్చు.కాబట్టి కొనేప్పుడు ఇతర స్టోర్లతో ధరలను కంప్యార్ చేసుకోండి.

బిగ్ బాస్కెట్: ఇది కూడా మీకు తక్కవ ధరకే సరుకులను అందిస్తుంది. అయితే ఇది కేవలం అన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్టోర్స్‌లో కూడా మంచి డిస్కౌంట్లను లభిస్తాయి. ముఖ్యంగా ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులు, బ్రాండెడ్ వస్తువులు కొంచెం ఖరీదైనవిగా ఉన్నప్పటికీ.. నాణ్యతకు విలువ ఇచ్చే వారికి ఇది మంచి ఎంపిక. ఇక్కడ ఎంపిక చేసిన సరుకులపై 11-12% వరకు డిస్కౌంట్లు అభిస్తుంది.

బ్లింకిట్: ఇది కూడా ఒక ఆన్‌లైన్ స్టోర్ ఇక్కడ కూడా మీకు చాలా ఆఫర్‌లు ఉంటాయి. సరుకులను ఫాస్ట్ గా డెలివరీ చేయడంలో ఈ స్టోర్లలో ప్రస్తుతం టాప్‌లో ఉంది.ఈ స్టోర్ నుంచి ఏదైనా వస్తువు ఆర్డర్ చేసుకుంటే కేవలం 10-20 నిమిషాల్లోనే అవి మీ ఇంటి చేరుకుంటాయి. రోజువారీ కిరాణా సామాగ్రి నుంచి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు ప్రతీది ఈ స్టోర్‌లో దొరుకుతుంది. ఇక్కడ కూడా ఇంచుమించు డీమార్ట్ తరహా ధరలకే సరుకులు లభిస్తాయి.

విశాల్ మెగా మార్ట్: ఇక్కడ కూడా మీకు సరుకులపై ఆఫర్లు లభిస్తాయి. కిరాణా సామాగ్రి, బట్టలు, గృహోపకరణాలను సరసమైన ధరలకు పొందడానికి మరొక గొప్ప ప్రదేశం ఇది. ఇక్కడ కొన్ని ఉత్పత్తులు డి-మార్ట్ కంటే చౌకగా కూడా లభించవచ్చు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్: మీరు ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా మంచి ఆఫర్లను అందిస్తాయి. ఇక్కడ కూడా కిరాణా నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటిపై 10–12 శాతం వరకు ధర తగ్గింపులు లభిస్తాయి. ఈ రెండు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ పండుగ సీజన్‌ల్లో భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. కాబట్టి డి-మార్ట్ మాత్రమే కాకుండా, అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దుకాణాలు కూడా తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఆఫర్లు, ధరలను చూసుకొని షాపింగ్ చేయడం ద్వారా మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు.(NOTE ఈ వ్యాపంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు.)